ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను విభజించే కుట్ర జరుగుతోందని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు రత్నాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలల ఐక్యత కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల వారు కలసిరావాలని పిలుపునిచ్చారు.