బుధవారం రోజున జిల్లా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్లో సంక్షేమ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలు నిబంధనల ప్రకారం పనిచేసేలా పర్యవేక్షించాలని అంగన్వాడీ సూపర్వైజర్లను ఆదేశించారు క్షేత్రస్థాయి తనిఖీలు సందర్భంగా అంగన్వాడి కేంద్రాల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేస్తూ నిర్లక్ష్యంగా పనిచేస్తున్న సూపర్వైజర్ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సక్రమంగా పనిచేయాలని ఉద్దేశం ఉంటే జిల్లాలో కొనసాగాలని తీరు మారకపోతే సెలవులపై వెళ్లాలంటూ కలెక్టర్ సూపర్వైజర్లకు సూచించారు