ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఈనెల 3వ తేదీన జరిగిన హత్య ఘటనపై సోమవారం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన బ్రహ్మయ్యను అదే గ్రామానికి చెందిన వెంకట సాయి తేజ తన ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశాడు. విచారణ అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. మరికొద్ది సేపట్లో హత్య జరిగిన పూర్తి వివరాలను డీఎస్పీ నాగరాజు వివరిస్తారని అన్నారు.