రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అన్నారు. శుక్రవారం బేతంచెర్లలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో మండలంలోని సమస్యలు గురించి చర్చించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పొగా, సకాలంలో సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.