శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లి, బోయపేట, కోటర్స్, నడిమ సావిటి కాలనీతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తిని ట్రాక్టర్లపై మంగళవాద్యాలు, కోలాటాలు, బాణాసంచా నడుమ ఊరేగించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు ఆనందంగా పాల్గొన్నారు. నిర్వాహకులు అన్నదానం, తీర్థప్రసాదాలను అందజేశారు