సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డిఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. డివిజన్ పరిధిలోని జహీరాబాద్, న్యాల్కల్, కోహిర్, మొగుడంపల్లి, జరా సంఘం మండలాలకు చెందిన కార్మికులు నిరసన లో పాల్గొన్నారు .గత రెండు నెలలుగా వేతనాలు అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జీతాలు అందక దసరా పండుగను ఎలా జరుపుకోవాలని ప్రశ్నించారు.వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.