రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి: ఎమ్మెల్సీ రేణిగుంట బస్టాండ్లో మెగా వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా.సిపాయి సుబ్రహ్మణ్యం, సర్పంచ్ నగేశం పాల్గొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందజేశారు. ఎమ్మెల్సీ రక్తదాన ప్రాముఖ్యత, దాతల ఆరోగ్యం, యువతలో మానవతా విలువలను వివరించారు.