రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధికసంఖ్యలో పోటెత్తారు. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు