ఆహార భద్రత చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి నివేదికలపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ సభ్యులు భారతి ఆనంద్ శారదలతో పాటు వికారాబాద్ జిల్లా అదనపూ కలెక్టర్ లింగ్యా నాయక్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ పాల్గొన్నారు.