Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: వరద నీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాము : ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ

Ibrahimpatnam, Rangareddy | Aug 26, 2025
మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎంక్లేవ్ కాలనీలో ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గాయత్రీ ఎంక్లేవ్ కాలనీ నుంచి బొల్లారం మెయిన్ రోడ్డు వరకు ఒక కోటి 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే వరదనీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వరద నీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us