అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చమకురి కలెక్టరేట్ లో మాట్లాడుతూ కుల వివక్షత పై పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించుకుంటున్నా మన్నారు. మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ విద్యకు పాటుపడిన గొప్ప సంస్కర్త. స్వయంగా తన భార్యకు చదువు చెప్పించి, టీచర్ గా పని చేయించి బాలికల విద్యకు కృషి చేశారు. ఆ రోజుల్లో 1850-60 కాలంలోనే బాల్య వివాహాలను ఆయన వ్యతిరేకించారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా అక్కడక్కడా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఆ మహనీయుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాల్యవివాహాల నిర్మూలనకు మనమందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది.