కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఎమ్మార్వో ఇంట్లో అర్ధరాత్రి జరిగిన చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న కూకట్పల్లి ఏసీబీ రవి కిరణ్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగా ఉన్న దంపతులపై దాడి చేసి, చోరీ చేశారన్నారు. మరో ఇంట్లో కూడా చోరీ చేసేందుకు ప్రయత్నించారని, ఓనర్ 100 కి కాల్ చేయడంతో దుండగులు పరారయ్యారని ఎసిపి వెల్లడించారు.