ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సోమవారం పడమర బజార్ లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయక విగ్రహంతో పాటు పలు బజార్లలో ఏర్పాటుచేసిన విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రంగులు జల్లుకుంటూ నృత్యాలు చేస్తూ పలు రకాల గీతాలాపనతో కార్యక్రమం కొనసాగించారు. భాజా భజంత్రీల మేళతాళాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించుకుంటూ నిమజ్జనానికి తరలించారు.