విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండగంగపూడి లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో గిరిజన రైతులు నంది రమేష్ , మరో ముగ్గురు రైతులుకి చెందిన 30 మేకలు పిడుగు పడి మృత్యువాత పడ్డాయి. మృతిచెందిన మేకలను తక్షణమే నష్టపరిహారం చెల్లించి పేద గిరిజన రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్ల జగన్ విజ్ఞప్తి చేశారు.