Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నూతన మద్యం పాలసీ ఉంది: పట్టణంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్

Kamareddy, Kamareddy | Aug 23, 2025
గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నూతన మద్యం పాలసీని ఉందని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ అన్నారు.శనివారం 2 గంటలకి కామారెడ్డి లో జరిగిన సమావేశంలో ఆయనవమాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ లిక్కర్ కంపెనీలకు, బడా వ్యాపారులకు లాభం చేకూర్చి లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తిని దెబ్బతీస్తుంది అన్నారు. 15% గౌడ్ లకు రిజర్వేషన్ వల్ల కొంతమంది గౌడు లకు ఉపయోగపడుతుంది తప్ప కల్లుగీత వృత్తి చేసే వాళ్లకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us