ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆదేశాల మేరకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమంను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహబూబ్ వలి మాట్లాడుతూ వైయస్సార్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ప్రజలకు ఆయన చేసిన సంక్షేమ పథకాలని ముఖ్యంగా 108 రాజీవ్ ఆరోగ్యశ్రీ ముస్లింలకు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ముఖ్యమైనవి అన్నారు.