జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 నుండి 14 వరకు డామన డయూలో జరుగుతున్న మహిళల రక్షణ, చట్టాలు, భద్రతపై అవగాహన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అధికారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ విజయానంద్ ను గురువారం సాయంత్రం జిల్లాలోని వెలగపూడి లో గల రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ కలిసి కోరారు. జాతీయ మహిళా కమిషన్, లాల్ బహుదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రం నుండి అధికారులతో పాటు పోలీస్ అధికారులను నామినేట్ చేయాలని సిఎస్ విజయానంద్ ను కోరారు.