స్వార్థ రాజకీయల కోసం మా లాంటి సామాన్యుల బతుకుతో ఆడుకోవడం ఏంటని మృతుడు మహేశ్ కుటుంబ సభ్యులు నిన్న సోమవారం రోజున రాత్రి 8 గంటలకు మాధవరావు పల్లి లో ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా మా మరిది గారి ఫ్లెక్సీ పట్టుకొని మీ రాజకీయాల కోసం వాడుకోవడం పద్ధతి కాదన్నారు. చేతనైతే సాయం చేయండి కానీ అమాయకులను బాధ పెట్టడం, రాజకీయలకు వాడుకోకండన్నారు. మేము బాధలో ఉంటే ఓర్చేది పోయి ఫ్లెక్సీలు పట్టుకొని నవ్వుతూ భిక్షాటన అడగడం తమకు నచ్చడం లేదన్నారు.