రామాయంపేట మండలంలో కార్మిక శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రామాయంపేట మండలం పర్వతాపూర్, కాట్రియాల మధ్య భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డును ఆయన పరిశీలించారు. రైతుల పంట నష్టాన్ని అయిన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులు బాధితులను పూర్తిగా ఆదుకుంటుందని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.