జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక అవసరాల పిల్లల ఉపకరణాల గుర్తింపు శిబిరానికి 385 మంది హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డిలో 192, ఖేడ్లో 93, జహీరాబాద్లో 100 మంది దివ్యాంగ విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. వీరిలో అర్హులైన వారికి ఉపకారణాలను అందిస్తామని పేర్కొన్నారు.