ప్రజా ఉద్యమాలను అనిచి వేసేందుకే జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తోందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి. మానవ అక్రమ రవాణా. ఇతర కార్యకలాపాలు జోరుగా సాగుతుంటే పట్టించుకోకుండా ప్రజా సమస్యల పై ఉద్యమం చేస్తున్న ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల పై 30 యాక్ట్ పేరుతో అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని. 30 యాక్ట్ పేరుతో ప్రజా ఉద్యమాన్ని ఆపాలేరని..విద్యార్థి ప్రజా సంఘాల నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.