చాగలమర్రి మండలం ముత్యాలపాడులో రూ.1.93 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శనివారం భూమిపూజ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నరసింహ రెడ్డి, నాయకులు అన్సర్ బాషా, నాగరాజు, బ్రహ్మం, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.