నాగలిగిద్ద మండలంలో మంజీరా బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయిన 2వేల ఎకరాల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ అధికారులు సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.