ఎ.ఐ. విధానంలో బోధన ద్వారా విద్యార్థులకు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం తిర్యాణి మండలం గంభీరావుపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, రికార్డులు,తరగతి గదులను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎ. ఐ. విధానంలో విద్యా బోధన ద్వారా విద్యార్థులకు మరింత విషయ పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ లో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు.