కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్. ఏ. సిరి పదవీభాద్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టర్ ఛాంబర్ లో పదవీభాద్యతలు స్వీకరించిన అనంతరం నూతన కలెక్టర్ కు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈసందర్భంగా కలెక్టర్ డాక్టర్. ఏ.సిరి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. జిల్లా లోని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు పోతామన్నారు. కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ డాక్టర్. బీ.నవ్య, డీఆర్ఓ లక్ష్మీ నారాయణమ్మ శుభాకాంక్షలు తెలిపారు.