ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని లంకోజనాపల్లి రోడ్డులో గల ఎస్సీ బాలికల వసతి గృహాన్ని గురువారం దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సందర్శించారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్ తో ఫోన్లో మాట్లాడి బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్టర్ తో చర్చిస్తామని ఆమె తెలిపారు.