కలకడ మండలం గంగాపురం గ్రామ పంచాయతీలో యూరియా ఔట్రీచ్ కార్యక్రమం అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు. సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు,మండల స్పెషల్ ఆఫీసర్ దయాకర్ రెడ్డి, ఎంపిడిఓ భాను ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా లభ్యత పై, సేంద్రీయ ఎరువుల వాడకం, నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా పొదుపుగా వాడటం మంచిదని అన్నారు. మండలంలో యూరియా కొరత లేదన్నారు. సేంద్రీయ వ్యవసాయం పై రైతులకు క్షేత్రంలో ఆచరణాత్మక ఉదాహరణలతో ఇతర రైతులకు ఎంఏఓ శ్రీనివాసులు అవగాహన కల్పించారు