ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్ గా పులపర్తి వెంకట ప్రశాంత్ నియమితులు కావడం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో భీమవరంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కత్తుల నీలేంద్ర, డిఎన్ఆర్, కేజీఆర్ఎల్ క్రికెట్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్ గా పులపర్తి వెంకట ప్రశాంత్ నియమితులవడంతో రాష్ట్ర పీఏసీ చైర్మన్, భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం సాయంకాలం 6 గంటలకు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.