మెదక్ జిల్లా ఆందోళ నియోజకవర్గం లోని అల్లాదుర్గం మండలం బోడుమెట్ పల్లి గ్రామంలో గుండు వాగు వల్ల దెబ్బతిన్న పత్తి పంటలను మరియు కులాలకు వెళ్లే రోడ్డును బుధవారం అధికారితో కలిసి కలెక్టర్ పర్యటించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోఅపార నష్టం వాటిల్లిందని అధికార యంత్రాంగం వరద నష్టం అంచనాల ముమ్మరంగా సాగుతున్నాయని పంట నష్టపోయిన ప్రతి రైతుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో స్పష్టమైన నివేదికలు రూపొందించి, ప్రభుత్వం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకు వెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు.