ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ గురువారం రాత్రి మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ganeshutsv.net వెబ్సైట్లో వివరాలు పొందుపరచాలని ఎంత మంది కమిటీ మెంబర్లు ఉంటారు. ఎన్ని రోజులు విగ్రహం ఏర్పాటు చేస్తారో ముందుగానే వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, మైక్ సెట్ ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని వెల్లడించారు.