పల్నాడు జిల్లా మాచర్ల మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తమ కార్యాలయంలో మండల ప్రభుత్వ వైద్యులు అన్వేష్ మీడియాతో మాట్లాడటం జరిగింది. సీజనల్ వ్యాధులు వస్తున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరము గనక ఒకటి రెండు రోజులు గనక వస్తే వెంటనే సంబంధిత డాక్టర్ను సంప్రదించాలన్నారు. తగు సూచనలు సలహాలు కూడా తీసుకోవాలని తెలియజేశారు.