పీలేరుండలం పీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా ఎం.సుధాకర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన కడప ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చి పీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు, కళాశాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. నూతన ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టి న సుధాకర్ రెడ్డిని కళాశాల బోధన, బోధనతర సిబ్బంది శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.