సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో బావిలో పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామానికి చెందిన ఊరడి లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో గొడవ పడి మనస్థాపానికి గురై గ్రామ శివారులోని నారాయణ అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం స్థానికుల సహాయంతో బావిలో నుండి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించమన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.