వికారాబాద్ మునిసిపల్ ఆధ్వర్యంలో ఇప్పటికే 482 కుక్కలను పట్టుకొని కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేశానని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అయినా వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలలో వీధి కుక్కల బెడద మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే పలు సోషల్ మీడియాలో వీధి కుక్కల దాడుల్లో గాయపడిన దృశ్యాలు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న వీధి కుక్కలను వెంటనే పట్టుకుని వెళ్లాలని మున్సిపల్ సిబ్బందికి కాలనీవాసులు కోరుతున్నారు.