Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 12, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వ సూచనల ప్రకారం తాము సిద్ధంగా ఉన్నామని ఆత్మకూరు ఆర్టీసీ మేనేజర్ శివ కేశవ్ యాదవ్ పేర్కొన్నారు. తమ డిపో పరిధిలో మొత్తం సర్వీసులలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సులలో 90% బస్సులలో ఉచిత ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. అవసరమైన సమయాల్లో మహిళలు ఉచిత బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.