ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఒక యువకుడు మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కిన హాల్ చల్ చేసాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సదరు యువకుడిని అయ్యప్ప గా గుర్తించారు. చరవాణిలో స్థానికులతో మాట్లాడుతూ ఆర్థిక సమస్యల కారణంతో టవర్ పైనుంచి దూకి చనిపోతానంటూ వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్ని మాపక సిబ్బంది అయ్యప్ప ను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప మద్యం మత్తులో ఇలా సెల్ టవర్ ఎక్కినట్లు భావిస్తున్నారు.