బొండపల్లి మండలంలోని కెరటం, దేవుపల్లి గ్రామాలలోని ఎరువుల విక్రయ దుకాణాలను బుధవారం మధ్యాహ్నం శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికి తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో ఎరువుల నిల్వలను ఎరువులు అమ్మకాలు జరిపిన విధానాలను పరిశీలించారు. అధిక ధరలకు ఎరువులను విక్రయించినా, అనధికారకంగా ఎరువులను నిల్వచేసినా డీలర్లపై చర్యలు తప్పవని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బి సింహాచలం హెచ్చరించారు. ఈ తనిఖీల్లో బొండపల్లి మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, ఏఈఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.