టీడీపీ ప్రభుత్వ వైఫల్యం రైతుల పాలిట శాపంలా మారిందని పంటలకు కావలసినటువంటి యూరియాను సరఫరా చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఉదయం 11 గంటలకు కల్లూరు లోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల తో 9వ తేదీన నంద్యాల జిల్లా లోని ఆత్మకూరు, నంద్యాల,డోన్,బనగానపల్లె,నందికొట్కూరు,ఆళ్లగడ్డ ఆయా నియోజకవర్గాల్లోని రెవెన్యూ అధికారులకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేయడం జరుగుతుందని రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.