నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని నార్కట్పల్లి అద్దంకి హైవేపై యూరియా లభ్యత కోసం రైతులో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బుధవారం పెద్ద ఎత్తున యూరియా కోసం ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అవసరమైన యూరియా అందక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని పలువురు రైతులు నినాదాలు చేపట్టారు. రైతాంగానికి సకాల సమయానికి యూరియా అందించాలన్నారు. అధికారులు రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పారు.