ఆదోని శివారులో రామజల చెరువులోకి భారీగా నీరుచేరి నిండుకుండలా మారింది. చెరువు నుంచి నీరు పొంగి పొర్లి ఉధృతంగా ప్రవహిస్తూ జలకళ సంతరించుకుంది. చెరువులో పిల్లలు ఈత కొడుతున్నారు. ఇక్కడ ఈత కొట్టడం ప్రాణాలకు ముప్పు అని అక్కడ పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని డీఎస్పీ హేమాలతకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. గతంలో ఈతకు వెళ్లి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారని పలువురు తెలిపారు.