డోన్లోని రైల్వే స్టేషన్ రోడ్డులో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్కేటింగ్ కోచ్ అశోక్ విద్యార్థులకు స్కేటింగ్ టోర్నీ నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.