మోపిదేవి మండలం ఉత్తర చిరువోల్లంకలోని ఔట్ ఫాల్ స్లూయీజును ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఐదు లక్షలకు తగ్గకుండా వరద కొనసాగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కృష్ణా నదికి వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరకట్టను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్య వేక్షించాలని దివిసీమ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు.