ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల లో శుక్రవారం పొలాల అమావాస్య వేడుకలను రైతులు వైభవంగా నిర్వహించారు. ఏడాది పొడవునా తమకు తోడుగా ఉండే బసవన్నలను అందంగా అలంకరించి, హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. శ్రావణ అమావాస్య రోజున ఎడ్ల కోసం ప్రత్యేకంగా పండుగను చేసుకోవడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది.