అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పితురు గ్రామంలో వెలిసిన పద్మశాలిల ఆరాధ్య దైవం శ్రీ భద్రావతి సమేత బావనారుషి స్వామి కళ్యాణం అంగరంగ వైభవం నిర్వహించారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన రామ లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు ఆధ్వరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.