విజయవాడ పటమటకు చెందిన నలుగురు బాలురు పాఠశాల అనంతరం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ పవన్ కిషోర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బందర్ బీచ్లో ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని, శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.