ఆదోని-ఢనాపురం నుంచి నాగనాథనహళ్లి మీదుగా హెబ్బటం, హోళగుంద వరకు 5 ఏళ్ల నుంచి దుర్భరమైన రోడ్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఆర్టీసీ అధికారులు గతంలో బస్సులు నడపలేక ఆపేసిన రోజులు ఉన్నాయి. విద్యార్థులకు, రైతులకు, అంబులెన్స్కు ఈ రోడ్డు ఒక్కటే దిక్కు. ప్రభుత్వ అధికారులు ఆలూరు మీదుగా 15 కి.మీ చుట్లూ తిరిగి వెళ్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.