జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గురువారం టెక్కలి ప్రెస్ క్లబ్ సభ్యులు టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందించారు. కొన్నేళ్లుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ జర్నలిస్టుల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు కార్యాలయానికి అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.