పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు టెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో గురు పూజోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన, డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు