ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో వైసీపీ నాయకులు కొందరు ప్రెస్మీట్లో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సరికాదని డీఎస్పీ కే.వి.వి.ఎన్.ఎస్. ప్రసాద్ అన్నారు. శుక్రవారం రాత్రి నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, ఇరువర్గాల నుంచి కొంతమంది ప్రైవేట్ బౌన్సర్లు, ఇతర వ్యక్తులు చేరడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందని డీఎస్పీ తెలిపారు.