కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు గాదె సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మాజీ సీఎం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన, కేసులు పెట్టిన కేసీఆర్ కానీ, బిఆర్ఎస్ శ్రేణులు భయపడారని అన్నారు. తెలంగాణ సమాజం బిఆర్ఎస్ కు తోడుగా ఉందని వెల్లడించారు